Saturday, November 9, 2024

తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం: సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని, దీనికోసం పూర్తి స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు కోసం సచివాలయం ఆవరణను మంగళవారం సిఎం పరిశీలించారు.

విగ్రహం ఏర్పాటు కోసం స్థలం, నమూనా గురించి అధికారులతో ఆయన చర్చించారు. డిసెంబర్ 9వ తేదీన సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సిఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారం చేసిన రోజున తెలంగాణ తల్లి ఉత్సవాలు చేయాలని సిఎం రేవంత్ రెడ్డి గతంలోనే నిర్ణయించారు.

ప్రతి సంవత్సరం డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి ఉత్సవాలు
ప్రతి సంవత్సరం డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి ఉత్సవాలు జరుగుతాయని గతంలో సిఎం తెలిపారు. ఈ వేడుకలు సచివాలయంలోని అన్ని కార్యాలయాల్లో నిర్వహిస్తామని ఆయన చెప్పారు. అదే రోజున తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది నిర్వహించే ఉత్సవాలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని పిలవాలనుకుంటున్నామని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి మార్పు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తుది రూపంపై చర్చలు జరుగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News