Thursday, September 19, 2024

జిహెచ్‌ఎంసి కమిషనర్‌గా ఆమ్రపాలి

- Advertisement -
- Advertisement -

ఆరుగురు ఐఎఎస్ అధికారుల బదిలీ
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి కాటా, హెచ్‌ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా కోట శ్రీవాత్స, మూసీ రివర్ డెవలప్ మెంట్ ఎండీగా దాన కిషోర్, హెచ్‌ఎండబ్లుఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మయాంక్ మిట్టల్, హెచ్‌ఎండిఏ మేనేజింగ్ డైరెక్టర్‌గా సర్ఫరాజ్ అహ్మద్, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్‌గా చాహత్ బాజ్ పాయ్‌ను ప్రభుత్వం నియమించింది. చాహత్ బాజ్ పాయ్ ఐటీడీఏ పీవోగా, అసిఫాబాద్ జెడిగా కూడా విధులు నిర్వహించారు.

జిహెచ్‌ఎంసి కమిషనర్‌గా ఆమ్రపాలి
ఐఏఎస్ ఆమ్రపాలికి ఉన్న అదనపు పోస్టులను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హెచ్‌ఎండిఏ జాయింట్ కమిషనర్ , మూసీ రివర్ బోర్డ్‌కు ఎండీ, గ్రోత్ కారిడార్‌కు ఎండీగా ఉన్న పోస్టులను తొలగిస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి పూర్తి స్థాయి బాధ్యతలను రేవంత్ సర్కార్ అప్పగించింది. ఇక మీదట జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి పూర్తిస్థాయిలో పనిచేయనున్నారు. కమిషనర్‌గా ఆమ్రపాలి సిటీలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం పరిధిలో పని చేస్తున్న అమ్రపాలి ఇటీవల రాష్ట్ర సర్వీసులకు వచ్చిన విషయం విదితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News