Wednesday, January 15, 2025

బాక్సాఫీస్ హిట్ హిందీ సినిమా ‘ స్త్రీ-2’

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నటి శ్రద్ధ కపూర్ నటించిన హారర్ కమ్ కామెడీ సినిమా ‘స్త్రీ-2’ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా పూర్తి టైటిల్ ‘స్త్రీ2: సర్ కటే కా ఆటంక్’. దీనిని అమర్ కౌశిక్ దర్శకత్వంలో మోడోక్ ఫిల్మ్స్ అండ్ జియో స్టూడియో నిర్మించింది. మోడోక్ సూపర్ నేచురల్ యూనివర్స్ తయారు చేసిన సినిమాలలో ఇది ఐదవది. ఇదివరలో వచ్చిన ‘స్త్రీ’ సినిమాకు ఇది రెండో పార్ట్(సీక్వెల్). ఈ సినిమాలో శ్రద్ధ కపూర్, రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠీ, అపర్ శక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ, అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్, విజయ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా తమన్నా భాటియా గెస్ట్ పాత్రలో…అందునా ఓ డ్యాన్స్ తో ప్రేక్షకులను అలరిస్తుంది. తల లేని మొండెం పాత్రలో సునీల్ కుమార్ అనే 7.7 అడుగుల జమ్మూ రెజ్లర్ నటించారు.

2024లో అత్యధిక గ్రాస్ కలెక్షన్ రాబట్టిన హిందీ సినిమా ఇది. 6 రోజుల్లోనే మొత్తంగా రూ. 250 కోట్లు రాబట్టింది. శ్రద్ధ కపూర్ నటించిన సినిమాల్లో ఇదే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా. ఈ సినిమా ఇప్పటికే చిచోరే(రూ. 153 కోట్లు), తు ఝూటీ మై మక్కార్(రూ. 147 కోట్లు), సాహో(రూ. 145 కోట్లు) రాబడులను దాటేసి విజయవంతంగా నడుస్తోంది.

సినిమా ఎంటర్ టైన్మెంట్ పరంగా బాగుంది. నిడివి కూడా చిన్నదే. శ్రద్ధగా  చూస్తుండగానే ఇంటర్వెల్ వచ్చేస్తుంది. తర్వాత వేగంగా ముగింపూ వచ్చేస్తుంది. శ్రద్ధా కపూర్ బాగా నటించింది. ఈ సినిమా ఇదివరలో ‘ ఓ స్త్రీ రేపు రా’ అనే కన్నడ సినిమాకు మారు రూపంగానే రూపొందించారు. ఈ సినిమా కథని నిరేన్ భట్ సరికొత్తగా రాశారు. ఈ సినిమా రేటింగ్ 3.  కాగా 15 ఆగస్టు 2024న విడుదలైన ఈ సినిమా 60 శాతంకు పైగా థియేటర్లలో నిండి మంచి వసూళ్లనే రాబట్టుతోంది. ‘కల్కి 2898 ఏడి’ సినిమా తర్వాత మంచి వసూళ్లను రాబట్టిన సినిమాగా దీనిని చెప్పుకోవచ్చు. సినిమా విలువలు కాక, కేవలం కాలక్షేపం కోరుకునే వారు ఈ సినిమా చూడొచ్చు.

రివ్యూ: అశోక్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News