Friday, November 22, 2024

మంకీపాక్స్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్:  ప్రపంచాన్ని కలవరపెడుతున్న మంకీ పాక్స్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్‌వో) ప్రకటన అందరికీ కాస్త ఊరటనిస్తోంది. ఇది కరోనా వంటిది కాదని, మంకీ పాక్స్‌ ను నియంత్రించవచ్చని వెల్లడించింది. డబ్ల్యుహెచ్‌వో యూరప్ రీజినల్ డైరెక్టర్‌గా విధులను నిర్వహిస్తోన్న హాన్స్ క్లుగే మీడియాతో మాట్లాడుతూ… మంకీ పాక్స్ వ్యాప్తి నియంత్రణకు, నిర్మూలనకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనిని కలిసి కట్టుగా ఎదుర్కోవాలన్నారు. ఈ వైరస్‌ను మనం నియంత్రించుదామా? లేక మరోసారి నిర్లక్ష్యం, భయం దిశగా వెళదామా? అన్నారు. ఇదంతా ప్రపంచం స్పందనపై ఆధారపడి ఉంటుందన్నారు. దీనిని నిర్మూలించడం, నియంత్రించడం ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాల్ అన్నారు.

మంకీ పాక్స్ ఆఫ్రికా దాటి పలు దేశాలకు విస్తరిస్తోంది. కరోనా తర్వాత, మళ్లీ ఈ వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. భారత్‌లోనూ కొన్ని నగరాల్లో కేసులు నమోదయ్యాయి. మన దేశంలో 30 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. మార్చి 2024లో కేంద్ర ప్రభుత్వం చివరి కేసును గుర్తించింది. ఆ తర్వాత మన దేశంలో ఎలాంటి కేసులూ నమోదు కాలేదు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం… 2022 నుంచి ఇప్పటి వరకు 116 దేశాలకు మంకీపాక్స్  వ్యాపించింది.  ప్రపంచవ్యాప్తంగా 99,176 కేసులు నమోదు కాగా, కాంగోలో వేగంగా వ్యాపిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News