Friday, December 20, 2024

ఏపి శాసనమండలి ప్రతిపక్ష నేతగా బొత్స

- Advertisement -
- Advertisement -

అమరావతి: బొత్స సత్యనారాయణ ఎంఎల్ సిగా  ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. కాగా వైసిపి పార్టీ ఆయనకు కీలక పదవి కట్టబెట్టింది. ఎంఎల్ సిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం బొత్స, జగన్ ని కలిశారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణను ఏపి శాసనమండలి ప్రతిపక్ష నేతగా ప్రకటించారు జగన్. బొత్స మాట్లాడుతూ తనకి అసెంబ్లీ అయినా, శాసన మండలి అయినా ఒకటేనని అన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తానన్నారు. తమని ఎదుర్కోడానికి మహా అయితే కేసులు పెడతారని, అంతకంటే ఏమీ చేయలేరని బొత్స అన్నారు.

బొత్స సత్యనారాయణను మండలిలో ప్రతిపక్ష నేతగా ప్రకటించిన కొద్ది సేపటికే మండలి ఫ్లోర్ లీడర్ గా ఉన్న ఆళ్ల అప్పిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తాను చివరి వరకు జగన్ తోనే ఉంటానని అప్పిరెడ్డి ప్రకటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News