జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
హైడ్రా ఏర్పాటు, లీగల్ స్టేటస్, విధివిధానాలపై హైకోర్టు ప్రశ్న
చెరువులు, నాలాల పరిరక్షణ కోసం హైడ్రా పని చేస్తుందన్న ప్రభుత్వ లాయర్
జన్వాడ ఫామ్ హౌస్‌కు సంబంధించి డాక్యుమెంట్లు పరిశీలించాలని ఆదేశం
నేటి వరకు కూల్చివేత చేపట్టవద్దన్న హైకోర్టు
మన తెలంగాణ/హైదరాబాద్: జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతను గురువారం వరకు చేపట్టవద్దని తెలంగాణ హైకోర్టు బుధవారం హైడ్రాను ఆదేశించింది. ఈ ఫామ్ హౌస్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉండటంతో కూల్చివేసే అవకాశముందని భావించిన బిఆర్‌ఎస్ నేత ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఫామ్‌మౌస్‌ను కూల్చకుండా స్టే విధించాలని దాఖలు చేసిన ఆయన పిటిషన్‌ను న్యాయస్థానం బుధవారం తోసిపుచ్చింది. కూల్చి వేతపై జివొ నెంబర్ 99 నిబంధనల ప్రకారం హైడ్రా నడుచుకోవాలని ఆదేశించింది. చెరువుల ఎఫ్‌టిఎల్ పరిధిని నిర్ణయించారా అని ప్రశ్నించిన హైకోర్టు 60 గజాలైనా 60 ఎకరాలైనా సరే నిబంధనల ప్రకారమే కూల్చివేయాలని నిర్దేశించింది.
జన్వాడ ఫామ్‌హౌజ్ విషయంలో నిబంధనలను పాటించాలని హైకోర్టు పేర్కొంది. ఫామ్‌హౌజ్ సంబంధించి అన్ని పత్రాలను పరిగణలోకి తీసుకోవాలన్న హైకోర్టు ఇన్నేళ్లుగా అధికారులకు ఎఫ్‌టీఎల్ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువుల ఎఫ్‌టీఎల్‌ను నోటిఫై చేశారా అని హైకోర్టు అడిగింది. చెరువుల ఎఫ్‌టీఎల్‌ను నోటిఫై చేస్తే ఆ వివరాలు ఇవ్వాలని హైకోర్టు వెల్లడించింది. ఎఫ్‌టీఎల్ పరిధులను ప్రాథమికంగా నోటిఫై చేశారని ఎఎజి వెల్లడించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం గురువారం వరకు స్టే విధించింది. పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం హైడ్రాను ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేశారని ప్రశ్నించింది. హైడ్రా లీగల్ స్టేటస్, విధివిధానాలను చెప్పాలని ప్రభుత్వాన్ని అడిగింది.
హైడ్రా ఏర్పా టును అభినందిస్తూనే హైడ్రా ఏర్పాటు, కమిషనర్‌కు ఉన్న పరిధులను ప్రశ్నించింది. ఈ క్రమంలో హైడ్రాకు ఉన్న పరిధుల గురించి చెప్పాలని ఎఎజికి హైకోర్టు సూచించింది. హైడ్రా ఇండిపెండెంట్ బాడీ అని ఎఎజి చెప్పారు. కూల్చివేతలకు ముందు ఎలాంటి లీగాలిటీస్ పాటిస్తున్నారని- హైకోర్టు అడగ్గా నోటీసులు ఇచ్చే కూల్చివేతలు చేపడుతున్నామని అడిష నల్ అడ్వకేట్ జనరల్ చెప్పారు. అవసరమైతే హైడ్రా కమిషనర్lను కోర్టులో హాజరుకావాలని అదేశిస్తామని- హైకోర్టు స్పష్టం చేసింది. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతలపై నిబంధనల ప్రకారం నడుచుకుంటామని – అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు వెల్లడించారు. హైడ్రా తరపు న్యాయ వాది విచారణకు హాజరు కాకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో హైడ్రా కూల్చివేతల తీరును ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటారని, స్థానిక సంస్థల అనుమతితో నిర్మాణాలు జరుగుతాయని పేర్కొన్న హైకోర్టు, 15–20 ఏళ్ల తర్వాత అక్రమ నిర్మాణమని కూల్చివేయడమేంటని వ్యాఖ్యానించింది. అనంతరం ఎఎజి మాట్లాడుతూ, చెరువుల పరిరక్షణ కోసమే హైడ్రా తీసుకువచ్చామని హైకోర్టుకు వెల్లడించారు. అయితే హైడ్రా పనితీరు విషయంలో ఎలాంటి సందేహం లేదన్న న్యాయ స్థానం కూల్చివేతల గురించి చర్చించాల్సి ఉందని స్పష్టం చేసింది. హైడ్రా ఓఆర్‌ఆర్ పరిధిలో పని చేస్తుందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాల పరిరక్షణ హైడ్రా విధి అన్నారు. జిహెచ్‌ఎంసితో కలిసి ఇది పని చేస్తుంద న్నారు.
హైడ్రా జీవో 111 పరిధిలోకి రాదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు వెల్లడించారు. అయితే నిర్మాణాలకు ఒక ప్రభుత్వ శాఖ అనుమతిస్తూ మరో శాఖ కూల్చి వేస్తుందని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. ఇరవై ఏళ్ల క్రితం నాటి నిర్మాణాలను హైడ్రా ఇప్పుడు కూలుస్తోందని హైకో ర్టు పేర్కొంది. ఆగస్ట్ 14న కొంతమంది అధికారులు వచ్చి జన్వాడ ఫామ్ హౌస్‌ను కూల్చివేస్తామని బెదిరించారని పిటిషనర్ తరఫు న్యాయ వాది హైకోర్టు దృష్టి కి తీసుకు వచ్చారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు జన్వాడ ఫామ్ హౌస్‌కు సంబంధించి అన్ని డాక్యుమెంట్లను పరిశీలించాలని ఆదేశిం చింది. జీవో 99 ప్రకారం నిబంధనల మేరకు హైడ్రా నడుచుకోవాలని పేర్కొంది.
అసలేం జరిగింది?
జన్వాడ ఫాం హౌస్ కూల్చొద్దంటూ ప్రదీప్‌రెడ్డి అనే వ్యక్తి రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝళిపిస్తోంది. జన్వాడ ఫాంహౌస్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉండటంతో కూల్చే అవకాశం ఉందని పిటిషన్‌లో వివరించారు. హైడ్రా కూల్చకుండా స్టే ఇవ్వాలని హైకోర్టులో ప్రదీప్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లో ప్రతివాదులుగా స్టేట్ గవర్నమెంట్, హైడ్రా కమిషనర్ లను చేర్చారు. అలాగే రంగారెడ్డి జిల్లా కలెక్టర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులను, శంకర్‌పల్లి రెవెన్యూ ఆఫీసర్, చీఫ్ ఇంజినీర్‌ను కూడా ప్రతివా దులుగా పేర్కొన్నారు.