Sunday, December 22, 2024

కాళేశ్వరంలో తప్పిదాలు జరిగాయి: రిటైర్ట్ ఈఎన్సీ వెల్లడి

- Advertisement -
- Advertisement -

ప్రాజెక్టుకు కొంత నష్టం వాటిల్లింది
ఎనిమిది పేజీల్లో ప్రశ్నలకు వివరణ
రెండుగంటల పాటు క్రాస్‌ ఎగ్జామినేషన్
జస్టిస్ పిసి ఘోస్ ముందు రిటైర్ట్ ఈఎన్సీ వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్: గోదావరినదీ జలాల ఆధారంగా చేపట్టిన కాళేశ్వరం సాగునీటి ఎత్తిపోతల పాజెక్టు నిర్మాణం సందర్భంగా క్షేత్ర స్థాయిలో తప్పదాలు జరిగినట్టు నీటిపారుదల శాఖ విశ్రాంత ఈఎన్సీ మురళీధర్ జస్టిస్ పిసి ఘోస్ కమిషన్ ముందు వెల్లడించినట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన విచారణ తదుపరి దశ బుధవారం నుంచి ప్రారంభం తిరిగి ప్రారంభమైంది.

ఈ పధకం పనుల్లో జరిగిన తప్పదాలపై విచారణ కోసం ఏర్పాటైన జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ ఇప్పటికే పలువురు నీటిపారుదుల శాఖ ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, పదవీ విరమణ చేసిన వారు, ఇతరులను విచారణ చేసింది. నీటిపారుదల శాఖలో సదీర్గకాలం పాటు ఈఎన్సీగా పనిచేసి రిటైర్డ్ అయిన మురళీధర్ రావుతో బుధవారం కమీషన్ క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను నిర్వహించింది. సుమారు రెండు గంటల పాటు విచారణ జరిగినట్టు తెలుస్తోది. జస్టిస్ పిసీ ఘోస్ ఈ విచారణలో మురళీధర్ రావును ఎనిమిది పేజీల ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది.

కాళేశ్వరం నిర్మాణంలో కొన్ని తప్పులు జరిగాయని, క్షేత్ర స్థాయిలో అధికారుల తప్పిదాలతో ప్రాజెక్టుకు కొంత నష్టం జరిగినట్టు కమీషన్ ముందు వెల్లడించారని తెలుస్తోంది. ఇదివరకే మరికొందరు ఇంజనీర్లనుంచి అవసరమైన విషయాలను ఆరా తీసిన కమిషన్ అందరి నుంచి అఫిడవిట్లు స్వీకరించింది. కమిషన్ ముందు ఇప్పటి వరకు 57 మంది అఫిడవిట్లు దాఖలు చేశారు. తదుపరి దశలో వారందరినీ కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. కమిషన్ కార్యకలాపాలు సాగుతున్న బీఆర్కే భవన్‌లోనే ఈ బహిరంగ విచారణ ప్రక్రియ జరగనుంది. కమిషన్ ముందు దాఖలు చేసిన అంశాలను పరిగణనలోకి తీసుకొని వాటి ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించనున్నారు. సాక్ష్యాలు కూడా నమోదు చేస్తారు. ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. అవసరమైన వారు న్యాయవాదులను కూడా వెంట తెచ్చుకునే వెసులుబాటు ఉంది.

రోజుకు ఒకరు లేదా ఇద్దరిని కమిషన్ విచారణకు పిలవనుంది. ఇందులో భాగంగా మొదటి రోజు నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్‌గా సుధీర్ఘ కాలం పనిచేసిన మురళీధర్ కమిషన్ ముందు హాజరయ్యారు. మురళీధర్ ఇప్పటికే దాఖలు చేసిన అఫిడవిట్, అందులోని అంశాల ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్ ఆయనను ప్రశ్నించారు. పరిస్థితులు, అంశాల్లోని తీవ్రతను పట్టి రోజుకు ఒకరు లేదా ఇద్దరిని కమిషన్ విచారణ చేయనుంది. వాటి ఆధారంగా అవసరమైతే ఇతరులకు కూడా కమిషన్ నోటీసులు జారీ చేయనుంది. ఆనకట్టలపై విచారణ చేసిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం మధ్యంతర నివేదికను కమిషన్‌కు సోమవారం సమర్పించింది. ఆ నివేదికను కూడా కమిషన్ సమగ్రంగా పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News