హైదరాబాద్: అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానీపై హిండెన్ బర్గ్ ఆరోపణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. హైదరాబాద్‌లోని గన్‌పార్కు నుంచి ఇడి ఆఫీస్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సీతక్క మీడియాతో మాట్లాడారు. చిన్నాచితక లీడర్లపై ఇడి దాడులు చేస్తోందని, రూ. లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన అదానీని ఇడి ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. అదానీ అక్రమాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నామని సీతక్క స్పష్టం చేశారు. జెసిపి వేస్తేనే అక్రమాలు బయటకు వస్తాయన్నారు. బిజినెస్ రూల్స్ ప్రకారం వ్యాపారాలు చేస్తామని ఎవరు వచ్చిన తెలంగాణ ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేస్తుందని తెలియజేశారు. ఈ ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొంటారని పేర్కొన్నారు.
అదానీ అక్రమాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నాం: సీతక్క
- Advertisement -
- Advertisement -
- Advertisement -