ముంబై: భారత క్రికెట్ జట్టు వచ్చే ఏడాది ఇంగ్లండ్ గడ్డపై పర్యటించనుంది. ఈ క్రమంలో భారత్‌ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగనుంది. 2025 జూన్ 20 నుంచి సిరీస్ ఆరంభం కానుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ నాలుగో సైకిల్‌లో భాగంగా ఈ సిరీస్ నిర్వహించనున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లండ్‌పై భారత్ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఇక సిరీస్‌కు సంబంధించిన వివరాలను ఇంగ్లండ్, భారత క్రికెట్ బోర్డులు ఖరారు చేశాయి. వచ్చే ఏడాది జూన్ 20 నుంచి ఆగస్టు 9 వరకు సిరీస్ జరుగుతుంది.
భారత్ చివరి సారి 2021లో ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్ 2-2తో సమంగా ముగిసింది. అప్పట్లో ఇరు జట్లు రెండేసి టెస్టుల్లో విజయం సాధించాయి. ఒక టెస్టు డ్రాగా ముగిసింది. తాజాగా భారత్ మరోసారి ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. కీలకమైన సిరీస్‌లో ఇరు జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇంగ్లండ్‌ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ప్రతి సిరీస్ ఆసక్తికరంగా సాగడం అనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా సిరీస్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. కొంతకాలంగా ఇంగ్లండ్ గడ్డపై భారత్ మెరుగైన ప్రదర్శనతో అలరిస్తోంది. వచ్చే సిరీస్‌లో కూడా సత్తా చాటాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. సిరీస్‌కు ఇంకా చాలా సమయం ఉన్నా ఇప్పటి నుంచే ఇరు దేశాల అభిమానులు దీని కోసం ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
కాగా, జూన్ 20 నుంచి 24 వరకు లీడ్స్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగనుంది. రెండో జులై రెండు నుంచి జరుగుతుంది. దీనికి బర్మింగ్‌హామ్ ఆతిథ్యం ఇవ్వనుంది. లండన్ వేదికగా జులై 10 నుంచి మూడో టెస్టు జరగనుంది. నాలుగో టెస్టుకు మాంచెస్టర్ వేదికగా నిలువనుంది. జులై 23న ఈ టెస్టు ప్రారంభమవుతుంది. ఇక ఐదో చివరి టెస్టు మ్యాచ్ కూడా లండన్‌లో జరుగుతుంది. జులై 31 నుంచి ఆగస్టు 4 వరకు ఈ మ్యాచ్ జరుగనుంది. ఇదే సమయంలో భారత మహిళా క్రికెట్ జట్టు కూడా ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. సిరీస్‌లో భాగంగా భారత విమెన్స్ టీమ్ మూడు వన్డేలు, ఐదు టి20లలో ఇంగ్లండ్‌తో తలపడుతుంది.