హైదరాబాద్: గత కొంత కాలంగా గాఢంగా ప్రేమించుకుంటున్న కిరణ్ అబ్బవరం- రహస్య గోరక్ పెళ్లి చేసుకున్నారు. కర్నాటక రాష్ట్రంలోని గూర్గ్ లో ఓ ఫంక్షన్ హాల్ లో కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు, స్నేహితుల సమక్షంలో వారు వివాహం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 2019 సంవత్సరంలో రాజావారు రాణిగారు సినిమాలో కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ హీరో-హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో చేస్తున్నప్పుడు ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఇద్దరు పలుమార్లు బయట కలుసుకోవడంతో వారిపై రూమర్లు వచ్చినప్పటికి వారు ఎప్పుడు స్పందించలేదు. తాము అతి త్వరలో ఇద్దరం ఒకటి కాబోతున్నామని చెప్పి అభిమానులను ఇప్పుడు సర్‌ఫ్రైజ్ చేయడంతో షాక్ అవుతున్నారు. రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమి వచ్చిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
Exclusive visuals from the #KiranRahasya wedding
The groom, @Kiran_Abbavaram, and the bride, #RahasyaGorak, look amazing at the wedding ceremony#KiranAbbavaram pic.twitter.com/D6eYhy8O1W
— Vamsi Kaka (@vamsikaka) August 22, 2024