Sunday, November 10, 2024

భావోద్వేగాలు కొంత వరకే…

- Advertisement -
- Advertisement -

ఎమోషనల్ పాలిట్రిక్స్‌తో తమకు జరిగే లాభమేమీలేదని మన దేశ ఓటర్లు గ్రహించారు. ఓటర్ల తీర్పుతోనైనా ఎమోషనల్ రాజకీయాలు నడిపే పార్టీలు తీరు మార్చుకోవాలన్న సంకేతం స్పష్టంగా వెలువడితే బిజెపి మాత్రం తన పాత పంథాలోనే కొనసాగే ప్రయత్నం చేస్తోంది. దీనికి కారణం బిజెపి వద్ద ఓ విజన్ లేకపోవడమేనన్నది బహిరంగ సత్యం. ఎందుకంటే హిందుత్వ అనే ఎమోషన్ అజెండాతో దేశంలో బిజెపి రాజకీయంగా ఎదిగింది. సొంతంగా సంపూర్ణ మెజారిటీతో కేంద్రంలో రెండు పర్యాయాలు అధికారం చేపట్టింది. ఎమోషనల్ రాజకీయాలతో కాసులు రాలవు. అవి ప్రజల ఆకలి తీర్చవు అన్నది గ్రహించడానికి పదేళ్ల సమయం మాత్రం పట్టింది. దేశ ప్రజలు ఎమోషనల్ పాలిట్రిక్స్‌కు చమరగీతం పాడగా ఇపుడు ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో మన దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు కొట్టుమిట్టాడుతున్నాయి.

భారతీయులు ఎమోషనల్ అంశాలకే ప్రాధాన్యత ఇస్తారు అన్నముద్ర వేసిన రాజకీయ నేతలకు చెంపపెట్టు లాంటి జవాబు ఇచ్చారు మన దేశ ఓటర్లు. గత కొంత కాలంగా అంటే దశాబ్ద కాలంగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎమోషనల్ పాలిట్రిక్స్ మొదలైంది. వీటికి ప్రజల ఆశీర్వాదం కూడా లభించింది. దీంతో కేంద్రంలో మోడీ సర్కార్ రెండు పర్యాయాలు సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి రాగా తెలుగు రాష్ట్రాలలో కూడా ఇదే ఎమోషనల్ పాలిట్రిక్స్ బాగా పని చేసింది. కానీ మన దేశ ఓటర్లు ఎంతగా ఎమోషనల్‌కు కనెక్ట్ అయ్యారు అంతే తీవ్రంగా వాటికి వ్యతిరేకంగా స్పందించారు. ఎమోషనల్ పాలిట్రిక్స్ సామాన్యుడి కడుపు నింపదు. వారి సమస్యలను పరిష్కరించదు. వారి ఉన్నతికి దోహదపడదు అన్నది గ్రహించడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. ఇపుడు దేశంలో అదే జరిగింది.

ఎమోషనల్ పాలిట్రిక్స్‌తో తమకు జరిగే లాభమేమీలేదని మన దేశ ఓటర్లు గ్రహించారు. ఓటర్ల తీర్పుతోనైనా ఎమోషనల్ రాజకీయాలు నడిపే పార్టీలు తీరు మార్చుకోవాలన్న సంకేతం స్పష్టంగా వెలువడితే బిజెపి మాత్రం తన పాత పంథాలోనే కొనసాగే ప్రయత్నం చేస్తోంది. దీనికి కారణం బిజెపి వద్ద ఓ విజన్ లేకపోవడమేనన్నది బహిరంగ సత్యం. ఎందుకంటే హిందుత్వ అనే ఎమోషన్ అజెండాతో దేశంలో బిజెపి రాజకీయంగా ఎదిగింది. సొంతంగా సంపూర్ణ మెజారిటీతో కేంద్రంలో రెండు పర్యాయాలు అధికారం చేపట్టింది. ఎమోషనల్ రాజకీయాలతో కాసులు రాలవు. అవి ప్రజల ఆకలి తీర్చవు అన్నది గ్రహించడానికి పదేళ్ల సమయం మాత్రం పట్టింది. దేశ ప్రజలు ఎమోషనల్ పాలిట్రిక్స్‌కు చమరగీతం పాడగా ఇపుడు ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో మన దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు కొట్టుమిట్టాడుతున్నాయి.

ఈ విషయానికి వస్తే ఎమోషనల్ కనెక్షన్‌తోనే మోడీ అయినా కెసిఆర్ అయినా చాలా కాలం రాజకీయాలు చేశారు. ఒకే సమయంలో కేంద్రంలో నరేంద్ర మోడీ, తెలంగాణలో కెసిఆర్ అధికారంలోకి వచ్చారు. ఇద్దరూ రెండు సార్లు గెలిచారు. అయితే మూడవసారి కెసిఆర్ ఓటమి చెంది ప్రతిపక్షానికి పరిమితం అయితే బిజెపి మాత్రం సొంతంగా మెజారిటీ రాని నేపధ్యంలో మిత్రుల మీద ఆధారపడి అధికారాన్ని దక్కించుకున్నది. ఇక ఎమోషనల్ కనెక్షన్‌తోనే మోడీ అయినా కెసిఆర్ అయినా చాలా కాలం రాజకీయాలు చేస్తూ వచ్చారు. ఎప్పటికప్పుడు ప్రజలలో ఎమోషనల్‌ను రగిల్చి వారు వరస విజయాలను దక్కించుకొన్నారు. ఇటీవల కాలంలో కెసిఆర్ అయితే ఓటమి చెంది విపక్షనేతగా ఉన్నారు.

బొటాబొటి మెజారిటీతో మిత్రుల సహకారంతో కేంద్ర గద్దెనెక్కినా కూడా మోడీకి మాత్రం అపజయాలు ఎదురవుతున్నాయి. ఇటీవల జరిగిన 13 అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నికల్లో కేవలం రెండు సీట్లు మాత్రమే బిజెపి దక్కించుకుంది. దీని కంటే ముందే 2024 సార్వత్రిక ఎన్నికల్లోనే నరేంద్ర మోడీకి కన్నులొట్టబోయిన చందంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలొచ్చాయి. సాధారణ మెజారిటీని సైతం అందుకోలేని విధంగా బిజెపి పరిస్థితి తయారైంది. దాంతో తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు, బీహార్‌కి చెందిన జెడి(యు) అధినేత నితీశ్ కుమార్‌ల సహకారంతోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణలో చూసుకుంటే కెసిఆర్‌కి రెండు సార్లు కలసివచ్చిన తెలంగాణవాదం భావజాలం సెంటిమెంట్ అంతా కూడా ఒక్కసారిగా ఎగిరిపోయింది.

అందుకే 2023 చివరిలో జరిగిన ఎన్నికల్లో కెసిఆర్ ఓటమి పాలు అయ్యారు. ఇక ఎపి విషయానికి వస్తే వైఎస్సార్ అనే సెంటిమెంట్ గట్టిగా పని చేయడంతో జగన్ ఎపికి ఒకసారి సిఎం అయ్యారు. అది కాస్తా 2024 ఎన్నికల్లో గాయబ్ కావడంతో జగన్ సైతం మాజీ సిఎం కావాల్సి వచ్చింది. ఇక ఇపుడు జాతీయ స్థాయిలో ఉప ఎన్నికల ఫలితాలు చూసినా సెంటిమెంట్లు ఏవీ లేవు కేవలం అభివృద్ధిని చూసే ప్రజలు ఓటు వేస్తున్నారు అని అర్ధం అవుతోంది.

ఈ నేపధ్యంలో ప్రజలకు హిందుత్వ సెంటిమెంట్‌తో టచ్‌లోకి వచ్చిన బిజెపికి 2024 ఎన్నికల ఫలితాలు కాని, తాజా ఉప ఎన్నికల ఫలితాను చూస్తే ఆ పార్టీకి మున్ముందు ఎమోషనల్ పాలిట్రిక్స్ వర్కట్ అవ్వదు అని స్పష్టంగా కనిపిస్తోంది. బిజెపి నమ్ముకున్న సెంటిమెంట్, అలాగే ఆ పార్టీ మొదటి నుంచి తన సీట్ల సంఖ్యను పెంచుకుంటూ వస్తున్న అమ్ములపొదిలోని అస్త్రం కానీ ఈసారి పని చేయడం లేదు. దేశంలో మెజారిటీ ప్రజలు మైనారిటీలు అంటూ ఎంతగా గొంతు చించుకున్నా కూడా ఓట్లు రాలడం లేదు. అదే సమయంలో రామాలయం నిర్మాణం జరిపిన అయోధ్యలోనూ బిజెపి ఓటమి పాలు కావడం చూస్తే బిజెపి ఎమోషనల్ పాలిట్రిక్స్‌కు ఇక కాలం చెల్లిందనే చెప్పాలి.

ఇక తెలంగాణాలో చూస్తే తెలంగాణ వాదం ముందు ఏది అయిన బలాదూర్ అన్న అంచనా ఉండేది. దాని ముందు ఎంతటి బడా పార్టీలు వచ్చినా ఓటమి చెందేవి. మన తెలంగాణ అంటూ జనంలో ఎమోషన్స్‌ని రగిలించి సొమ్ము చేసుకున్న తీరు కూడా బిఆర్‌ఎస్ ఎదుగుదలలో స్పష్టంగా కనిపించింది. ఇక ఎదురు లేదు అన్న పరిస్థితుల నుంచి బిఆర్‌ఎస్ ఓడి ఇపుడు రాజకీయ ఉనికి కోసం పాకులాడుతోంది. ఎపిలో చూస్తే వైఎస్సార్ అన్న మూడు అక్షరాలు సెంటిమెంట్‌గా మారి వైసిపి రాజకీయ ప్రయాణానికి కావాల్సినంత బూస్ట్ ఇచ్చింది. దాంతోనే ఇంతింతై అన్నట్లుగా ఎదిగి వైసిపి 151 సీట్లతో అధికారం చేపట్టింది. అయితే 2024లో చూస్తే కేవలం 11 అసెంబ్లీ సీట్లకే పరిమితం కావడం అంటే సెంటిమెంట్ అన్నది పూర్తిగా కరిగిపోయింది.
సహజంగా ఈ దేశవాసులు సెంటిమెంట్‌కి ఎక్కువగా ఆకర్షితులు అవుతారు.

అది రాజకీయ పార్టీలకు పెట్టుబడిగా ఉంటూ వస్తోంది. అయితే దానినే పదే పదే ప్రయోగిస్తే వికటిస్తుందన్న సత్యాన్ని 2024 ఫలితాలు దేశ వ్యాప్తంగా చాటి చెప్పాయి. ఎంతసేపూ సెంటిమెంట్ అంటూపోతే అభివృద్ధి అవసరం లేదా అన్నది జనం నుంచి వస్తున్న జవాబు.అందుకే ఈసారి జనాలు ఎమోషన్స్‌కి అసలు ఏ మాత్రం పడిపోలేదు. వాస్తవిక దృక్పథంతో అన్నీ ఆలోచించి ఓట్లు వేశారు. ఈ వాస్తవం రాజకీయ పార్టీలకు తెలిసినా ఏ అస్త్రంలేని బిజెపి మాత్రం మళ్లీ తన పాత హిందూ ఎమోషనల్ అజెండాను పట్టుకొని ఊగే ప్రయత్నం చేస్తోంది. సెక్యులర్ పార్టీలుగా తమకు తాము చెప్పొకొనే టిడిపి, జెడి(యు) వంటి వారి సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేసినా తన మత అజెండాను మాత్రం బిజెపి మార్చుకోవడంలేదు. ఈ క్రమంలోనే ఇటీవల వక్ఫ్ చట్టం మార్పు కోసం మోడీ సర్కార్ ప్రయత్నం చేయడమే.

సయ్యద్ నిసార్ అహ్మద్
78010 19343

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News