Thursday, September 19, 2024

షకిబ్ అల్ హసన్‌పై హత్య కేసు నమోదు!

- Advertisement -
- Advertisement -

ఢాకా: బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ కష్టాల్లో చిక్కుకున్నాడు. అతనిపై హత్య కేసు నమోదైనట్టు బంగ్లాదేశ్ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం రద్దు కావడంతో షకిబ్ ఎంపి పదవిని కోల్పోయాడు. ఇటీవలే అతను బంగ్లా జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. అంత సజావుగా సాగుతుందని భావిస్తున్న సమయంలో షకిబ్‌కు గట్టి షాక్ తగిలింది.

రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఇటీవల బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఆందోళనలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలో వందలాది మంది మృతి చెందారు. ఈ ఘటనల్లో రూబెల్ అనే యువకుడు మృతి చెందాడు. దీంతో రూబెల్ మృతిపై అతడి తండ్రి రఫికుల్ ఇస్లామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమారుడి మృతికి మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వమే కారణమని ఆరోపించాడు. రఫిక్ ఫిర్యాదు ఆధారంగా షేక్ హసీనాతో సమా 154 మందిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఇందులో షకిబ్ 28వ నిందితుడిగా ఉన్నాడు. దీంతో షకిబ్ క్రికెట్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News