Friday, September 20, 2024

కోల్ కతా డాక్టర్ కేసు: నేను అమాయకుడిని….ఇరికిస్తున్నారని బోరున ఏడ్చిన నిందితుడు

- Advertisement -
- Advertisement -

కోల్‌కతాలో లేడి డాక్టర్‌పై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ స్థానిక కోర్టులో ఏడ్చేశాడు. తనకు ఏ పాపం తెలియదని, తాను అమాయకుడిని అని మెజిస్ట్రేట్ ముందు విలపించినట్లు తెలిసింది. ఆయనపై పాలీగ్రాఫ్ టెస్టులకు రంగం సిద్ధం అయింది. ఈ క్రమంలో మెజిస్ట్రేట్ టెస్టుకు సిద్ధమేనా, దీనికి ఎందుకు అంగీకరిస్తున్నావు అని ప్రశ్నించారు. దీనితో ఒక్కసారిగా భావోద్వేగానికి గురైన సంజయ్ తాను నిర్ధోషిని అని, అయితే కేసుతో ముప్పుతిప్పలు పెడతున్నారని, కనీసం ఈ నిజపరీక్షల్లో అయినా నిజంగానే నిజాలు అందరికి తెలిసితీరుతాయని నమ్మకం ఉందని, అందుకే వాటికి అంగీకరించానని మెజిస్ట్రేట్‌కు తెలిపారు. టెస్టుకు ఆయన సమ్మతి పత్రం ఇచ్చిన తరువాత ఆయన లాయరు కవితా సర్కారు ఈ పాలీగ్రాఫ్ పరీక్ష ఏమిటీ? ఏ విధంగా జరపుతారు? అనేది ఆయనకు వివరించారు.

తాను నిర్దోషిని కాబట్టే ఎటువంటి పరీక్షకు అయినా సిద్ధమే అని న్యాయమూర్తికి తెలిపారు. తానే నేరం చేసినట్లు రాయ్ అంగీకరించినట్లు సిట్ ఆ తరువాతి క్రమంలో సిబిఐ కూడా కోర్టుకు తెలిపింది. అయితే బెదిరింపులతోనే ఈ విధంగా చెప్పాల్సి వచ్చిందని సంజయ్ రాయ్ వెల్లడించడంతో పాలీగ్రాఫ్ టెస్టులకు రంగం సిద్ధం అయింది. ఆసుపత్రి ఆవరణలో ప్రత్యేకించి నేర ఘటన జరిగిన చోట దొరికిన కొన్ని సాక్షాలు, సిసిటీవీ ఫుటేజ్‌లు, ఈ నిందితుడి తాగుడు ఇతర దుర్వసనాలు, అర్థరాత్రి తరువాత అనుమానాస్పద తిరుగుళ్లు, ప్రత్యేకించి ఆయన సెల్ ఫోన్ కాల్‌డేటాతో ముందుగా ఆయననే నేరం చేశాడని చెప్పడానికి ఆధారాలు దొరికినట్లు సిబిఐ, అంతకు ముందు సిట్ పేర్కొనడం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News