నేపాల్‌లో సంభవించిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 41 కి చేరింది. దాదాపు 43 మంది ప్రయాణికులతో నేపాల్ లోని పొఖారా నుంచి కాఠ్మండ్‌కు శుక్రవారం ఈ బస్సు బయలుదేరింది. రోడ్డుపై అదుపు తప్పి 150 అడుగుల లోతులో ప్రవహిస్తున్న మార్సయాంగడి నదిలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 41 మంది చనిపోయారని ,ప్రయాణికులు ఎంతమందో ఇంకా కచ్చితంగా తెలియవలసి ఉందని, 12 మందిని ఆస్పత్రికి నేపాల్ ఆర్మీ తరలించారని మహారాష్ట్ర మంత్రి మహాజన్ చెప్పారు.
ఢిల్లీ లోని దౌత్య కార్యాలయంతో తాము సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ప్రయాణికుల్లో చాలా మంది మహారాష్ట్ర లోని జలగావ్ జిల్లాకు చెందిన వారు. ప్రయాణికులు ఇంకా మరో 16 నుంచి 18 వరకు ఎక్కువ ఉండవచ్చని వారు చనిపోయి ఉండవచ్చని చెప్పారు. అంతకు ముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఇతర సీనియర్ కేంద్ర అధికారులతో మృతదేహాలను స్వదేశానికి రప్పించే ఏర్పాట్లుపై చర్చించారు. నేపాల్ నుంచి నాసిక్‌కు ఆదివారం ప్రత్యేక విమానం ద్వారా 24 మృతదేహాలు వస్తాయని కుటుంబీకులకు వాటిని అప్పగిస్తారని తెలుస్తోంది.