Wednesday, January 15, 2025

ఒక్క అంగుళం కూడా కబ్జా చేయలేదు: నాగార్జున

- Advertisement -
- Advertisement -

ఎన్ కన్వెన్షన్ సెంటర్ వివాదంపై టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున మరో ట్వీట్ చేశారు. ఎన్ కన్వెన్షన్ ను పక్కా పట్టా ఉన్న భూమిలో నిర్మించినట్లు మరోసారి స్పష్టం చేశారు. ఒక్క అంగుళం భూమి కూడా మేం ఆక్రమించలేదని, అయితే సెలబ్రిటీల విషయం వచ్చే సరికి భూతద్దంలో పెట్టి చూస్తారని నాగ్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు. ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ అంటూ కీలక విషయాలు పోస్ట్ చేశారు. ఎన్ కన్వెన్షన్ లో కొన్ని ఎకరాల భూమి కబ్జా చేసి నిర్మించినట్లు హైడ్రా శనివారం కీలక ప్రకటన చేయడం తెలిసిందే.

అందుకు నాగార్జున కౌంటరిస్తూ ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి తుమ్మిడికుంట చెరువు భూమిలో ఎలాంటి ఆక్రమణ జరగలేదని 24 ఫిబ్రవరి 2014న కోర్టు తీర్పు (Sr.3943/2011) ఇచ్చినట్లు నాగార్జున స్పష్టం చేశారు. హైకోర్టులో ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు చెప్పారు. చట్టాలను తానెప్పుడూ గౌరవిస్తానని, ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి ఎలాంటి ఊహాగానాలు, అవాస్తవాలు ప్రచారం చేయవద్దని కోరారు. వాస్తవాలు చెప్పడానికి తాను ఈ ట్వీట్ చేశానని, తమది పట్టా భూమి అని, ఒక్క అంగుళం కూడా కబ్జా చేసింది కాదని నాగ్ మరోసారి పునరుద్ఘాటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News