Saturday, December 21, 2024

లిఫ్ట్ ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ లోని మెహదీపట్నంలో లిఫ్ట్ ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మెహదీపట్నం పరిధిలోని ప్రియా కాలనీ గుడిమల్కాపూర్ లోని వకాస్ అపార్ట్ మెంట్ లో లిఫ్ట్ రాకముందే డోర్ ఓపెన్ కావడంతో లిఫ్ట్ గుంటలో పడి వ్యక్తి చనిపోయాడు. ఆ అపార్టుమెంట్ నాలుగో ఫ్లోర్ లో ఉంటున్న సమీ ఉల్లా బైగ్ (55) లిఫ్ట్ బటన్ ప్రెస్ చేయగా డోర్ తెరుచుకుంది.. అయితే లిఫ్ట్ రాకముందే డోర్ ఓపెన్ అయింది. అది గమనించని బైగ్ ముందుకు వెళ్లగా 4వ అంతస్తు నుంచి లిఫ్ట్ గుంటలో పడ్డాడు.. విషయం తెలుసుకున్న అపార్టు మెంట్ వాసులు, కుటుంబ సభ్యులు బైగ్‌ను బయటితీసి ఆస్పత్రికి తరలించారు.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News