Saturday, December 21, 2024

చేగూరు చౌరస్తాలో లారీ బీభత్సం

- Advertisement -
- Advertisement -

మద్యం సేవించిన లారీ డ్రైవర్ జాతీయ రహదారిపై బీభత్సం సృష్టించాడు. పలు వాహనాలను ఢీకొట్టి తల్లీబిడ్డ మృతికి కారణమయ్యాడు. పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం కర్ణాటకలోని హుబ్లీ నుంచి హైదరాబాద్‌కు లోడుతో వస్తున్న లారీ రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం చేగూరు చౌరస్తా వద్దకు రాగానే అదుపు తప్పింది. మద్యం మత్తులో ఉన్న డైవర్ షేక్ మహమ్మద్ స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోవడంతో లారీ ముందు వెళ్తున్న టెంపో,

ఆటో, ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న షాద్‌నగర్ పట్టణానికి చెందిన కావ్య(24), అనన్య (1) అక్కడికక్కడే మృతి చెందారు. సాయికృష్ణ, నిహారిక(4) గాయాలతో బయటపడ్డారు. ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News