- Advertisement -
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. లడఖ్‌లో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ప్రకటించారు.
ప్రధాని నరేంద్రమోడీ విజన్ ప్రకారం లద్ధాఖ్ అభివృద్ధి, శ్రేయస్సును కాంక్షిస్తూ ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటు నిర్ణయం తీసుకున్నామని అమిత్ షా చెప్పారు. లద్ధాఖ్‌లో జన్స్కర్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్‌థాంగ్ జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలు అందుతాయని షా చెప్పారు.
- Advertisement -