Monday, November 25, 2024

కుప్పకూలిన 35 అడుగుల శివాజీ విగ్రహం

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర లోని సింధుదుర్గ్ జిల్లా రాజ్‌కోట్ ఫోర్ట్ లోని ఛత్రపతి శివాజీ మహరాజ్ 35 అడుగుల ఎత్తైన భారీ విగ్రహం సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో కుప్పకూలింది. గత ఏడాది డిసెంబర్ 4న నేవీడే సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఎంతో అట్టహాసంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహం కూలిపోడానికి సరైన కారణం తెలియకపోయినా, గత రెండు రోజులుగా జిల్లాలో భారీ వర్షాలు , ఈదురు గాలులే కారణం కావచ్చని భావిస్తున్నారు.

విగ్రహం కూలిపోడానికి కారణాలను నిపుణులు పరిశీలిస్తున్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎన్‌సీపీ (ఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు , మాజీ మంత్రి జయత్ పటేల్ ఆరోపించారు. నాణ్యతా ప్రమాణాలను పట్టించుకోకుండా కేవలం ప్రధాన మంత్రితో ఆవిష్కరించడం పైనే దృష్టి పెట్టిందని విమర్శించారు. విగ్రహ నిర్మాణంలో నాసిరకం ప్రమాణాలు పాటించినట్టు శివసేన (యూబీటీ) ఎమ్‌ఎల్‌ఎ వైభవ్ నాయక్ ఆరోపించారు. దీనిపై దర్యాపు సమగ్రంగా జరిపించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News