Friday, December 20, 2024

తండ్రి ఎదుటే కుమార్తె మృతి

- Advertisement -
- Advertisement -

టెంపో బైక్‌ను ఢీకొట్టడంతో తండ్రి ఎదుటే కుమార్తె మృతిచెందిన హృదయవిదాకర సంఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. చెంగిచెర్లకు చెందిన ఎం.శంకరరావు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పిఎఫ్)లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నాడు. శంకర్‌రావుకు భార్య, కుమారుడు,కుమార్తె ఉన్నారు. కుమార్తె ఎం.ప్రసన్న(25)కు ఎర్రమంజిల్‌లోని ఎఐజి ఆస్పత్రిలో ఎండోస్కోపి పరీక్ష చేయించాల్సి ఉంది. ఈ క్రమంలోనే తండ్రి,కూతురు కలిసి బైక్‌పై ఆస్పత్రికి వస్తున్నారు. బేగంపేట మెట్రోస్టేషన్ సమీపంలోకి రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన టెంపో (టిఎస్ 10యూసి 5699) వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది.

దీంతో శంకర్‌రావు, ప్రసన్న రోడ్డుపై పడిపోయారు. ప్రసన్న తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తన కళ్ల ముందే కూతురు మృతి చెందడంతో శంకర్ రావు కన్నీరు మున్నీరుగా విలపించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పంజాగుట్ట పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మహబూబ్‌నగర్ జిల్లా, కొల్లాపూర్‌కు చెందిన టెంపో డ్రైవర్ సతీష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News