Friday, December 20, 2024

హిందువులకు యోగి ఆదిత్యానాథ్ హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

హిందువులంతా సంఘటితంగా ఉండాలి , లేకపోతే బంగ్లాదేశ్ మాదిరి పరిణామాలు ఇక్కడా జరుగుతాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ హెచ్చరించారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. దీనిని గమనించి అయినా హిందువులంతా ఒక్క తాటిపై నిలవాల్సి ఉందని తెలిపారు. సోమవారం ఆయన ఆగ్రాలో ఓ కార్యక్రమంలో మాట్లాడారు. భాటేంగే తో ఖాటేంగే అని ఫక్కా యుపి హిందీ యాస్‌లో సిఎం తెలిపారు. పార్టీలు , వర్గాలు పేరిట హిందువులు విడిపోవడం జరిగితే , దుష్ఫలితాలు చూడాల్సి వస్తుందన్నారు. సంఘటితంగా ఉండటమే మన జాగరూకత అన్నారు.

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల పట్ల ప్రతిపక్షాలు పెదవివిప్పకపోవడం దారుణం అన్నారు. అక్కడి దురాగతాలను ఖండించాల్సిన అవసరం లేదా? అని నిలదీశారు. విడిపోతే పడిపోవడం ఖాయం అన్నారు. మన వైఖరితోనే మనం ఊచకోతలకు గురి అయితే ఇంతకంటే దారుణం ఉంటుందా? అని ప్రశ్నించారు. ఆగ్రాలో అమరవీరుడు దుర్గాదాస్ రాథోడ్ విగ్రహం ఆవిష్కరణ తరువాతి సభలో ఆయన మాట్లాడారు. 17వ శతాబ్ధంలో మొఘలు చక్రవర్తి ఔరంగజీబుతో పోరు సల్సిన రాథోడ్‌ను యోగి స్మరించుకున్నారు. దేశం అన్నింటికంటే మిన్న , దేశాన్ని మించినది లేదని, మనం చరిత్ర నుంచి ఎంతో తెలుసుకుని తీరాలి. తప్పిదాలకు దారి ఇవ్వరాదని పిలుపు నిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News