Sunday, November 24, 2024

పాక్ లో జాతీయ రహదారులపై తీవ్రవాదుల కాల్పులు: 73 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉగ్రవాదులు కాల్పులకు తెగపడ్డారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని జాతీయ రహదారులను లక్ష్యంగా చేసుకొని తీవ్రవాదులు కాల్పులు జరపడంతో 73 మంది చనిపోయారు. మృతులలో పాక్ భద్రతా బలగాలలో 14 మంది సైనికులు ఉన్నారు. పాక్ బలగాలు నిర్వహించిన ఆపరేషన్‌లో 21 మంది తీవ్రవాదులు హతమయ్యారని పాక్ ఆర్మీ అధికారుల వెల్లడించారు. ఉగ్రవాదులు జాతీయ రహదారిపై చేరుకొని వాహనాలను ఆపి ఐడి కార్డులను పరిశీలించారు. వాహనాలను ఉన్న వారిని బయటకు లాక్కొచ్చి కాల్చి చంపారు.

అనంతరం వాహనాలను తగలబెట్టారు. స్థానికులు భద్రతా బలగాలకు సమాచారం ఇవ్వడంతో వారి అక్కడి చేరుకునేసరికి ఎదురుకాల్పులు జరిగాయి. కార్మికులను లక్షంగా చేసుకొని తీవ్రవాదులు కాల్పులకు తెగబడినట్టు ఆర్మీ అధికారులు గుర్తించారు. పంజాబ్ ప్రావిన్స్ కార్మికులతోనే స్థానికులు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని ఉద్దేశంతోనే ఈ దాడులు జరిగాయని పాక్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ దాడులకు బాధ్యత వహిస్తూ వేర్పాటువాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటన జారీ చేసింది. ఈ ఘటనను పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్ధారీ ఖండించారు. ఇదొక అనాగరిక చర్య అని మండిపడ్డారు. బాధితులను ఆదుకోవడంతో పాటు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News