Monday, December 23, 2024

‘తల్లి మనసు’కు అద్దం పట్టే చిత్రం

- Advertisement -
- Advertisement -

ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన తనయుడు ముత్యాల అనంత కిషోర్ నిర్మాతగా తొలిసారి సినీరంగంలోకి అడుగుపెట్టి నిర్మిస్తున్న చిత్రం ‘తల్లి మనసు’. రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రధారులు. పలువురు ప్రముఖ దర్శకుల వద్ద దర్శకత్వ శాఖలో విశేష అనుభవం గడించిన వి.శ్రీనివాస్ (సిప్పీ) దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కాగా కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్, బి.హెచ్.ఈ.ఎల్.లో హీరోయిన్ ఇంటికి సంబంధించిన సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఇందులో భాగంగా రచిత మహాలక్ష్మి, సాత్విక్, సాహిత్య, దేవీప్రసాద్, శుభలేఖ సుధాకర్ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. ఈ విషయాలను నిర్మాత ముత్యాల అనంత కిషోర్ మాట్లాడుతూ “30 శాతం షూటింగ్ పూర్తయింది. సింగిల్ షెడ్యూల్ లోనే షూటింగ్ పార్ట్ పూర్తి చేస్తాము”అని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News