- Advertisement -
భద్రాద్రి కొత్తగూడెం: ఆర్థిక ఇబ్బందులతో ఒంటిపై డీజిల్ పోసుకుని ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. హనుమాన్ బస్తీకి చెందిన కొప్పుల ఇమ్మానియల్(54) ఆటో డ్రైవరుగా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆటో కోసం కొంత అప్పు చేయడం, కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న ఇమ్మానియల్ మద్యానికి బానిసగా మారాడు. ఇంట్లో కూడా అతడితో భార్య గొడవ పెట్టుకొని తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన ఇమ్మానియల్ ఇంట్లో ఉన్న డీజిల్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన స్థానికులు మంటలు ఆర్పేసి వెంటనే అతడిని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఇమ్మానియల్ మృతి చెందాడని వైద్యులు పేర్కొన్నారు.
- Advertisement -