Sunday, November 24, 2024

శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ఎంఎల్‌సి కవిత చేరుకున్నారు. ఆమె వెంట బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, కుటుంబ సభ్యులు ఉన్నారు. ఢిల్లీ మద్యం కేసులో మంగళవారం ఎంఎల్‌సి కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇడి, సిబిఐ కేసుల్లో కవితకు బెయిల్ మంజూరు చేశారు. నిన్ననే ఆమె తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు.

ఇడి కేసులో 5 నెలలుగా, సిబిఐ కేసులో 4 నెలలుగా జైలులో ఉన్నారని చెప్పారు. 57 మంది నిందితులు ఈ కేసులో ఉన్నారన్నారు. ఈ కేసులో మొత్తం 493 మంది సాక్షుల వి చారణ ముగిసిందన్నారు. ఢిల్లీ మద్యం కేసులో ఛార్జ్‌షీట్లు కూడా దాఖలు చేశారని వెల్లడించారు. రూ.100 కో ట్లు చేతులు మారినట్లు ఆరోపణలు మాత్రమే అని అన్నారు. దర్యాప్తు సంస్థలు అడిగిన ఫోన్లను కవిత ఇచ్చారని చెప్పారు. ఫోన్లు మార్చడంలో తప్పేముందని ప్రశ్నించారు. సౌత్ గ్రూప్ 100 కోట్లు అంటున్నారని కానీ దాన్ని రికవరీ చేయలేదని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న ఇడి అధికారులు ఆమెను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు. అప్పటినుంచి జ్యుడిషియల్ రిమాండ్, కస్టడీలో భాగంగా తీహార్ జైల్లోనే ఉన్నారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియాకు బెయిల్ లభించిన తర్వాత కవితకు సైతం అదే తీరులో ఉపశమనం లభించడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News