హైదరాబాద్‌లో ఇటీవల వెలుగుచూసి రూ.175 కోట్ల సైబర్ స్కాం కేసులో ఓ బ్యాంకు మేనేజర్‌ను సైబర్ కైం సెక్యూరిటీ పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూర్చిన కేసులో సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. షంషీర్‌గంజ్ ఎస్‌బిఐ మాజీ మేనేజర్ మధుబాబు, సందీప్ శర్మలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షంషీర్‌గంజ్ ఎస్‌బిఐకి చెందిన ఆరు ఖాతాల నుంచి రెండు నెలలో రూ.175 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. బ్రాంచ్ మేనేజర్ మధుబాబు ఆరుగురు క్యాబ్, ఆటో డ్రైవర్లకు కరెంట్ అకౌంట్లు తెరిచినట్లు పోలీసులు వెల్లడించారు.
మహ్మద్ షోయబ్ అనే వ్యక్తి ఖాతాలు తెరిపించి ఖాతాదారులకు రూ.20 నుంచి రూ.30 వేల వరకు మధుబాబుకు కమిషన్లు ఇచ్చినట్లు చెప్పారు. రెండ్రోజుల క్రితం మహ్మద్ షోయబ్, అహ్మద్ బవాజీర్‌ను ఈ కేసులో పోలీ సులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన నలుగురు నిందితులను పోలీసులు విచారించారు. వారి నుంచి మరింత కీలక సమాచారంను పోలీసులు రాబట్టినట్లు తెలుస్తోంది. కాగా, ఈ స్కామ్‌లో క్రిప్టోకరెన్సీ ద్వారా విదేశాలకు సొమ్ములు తరలించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ఇప్పటివరకు వెలుగుచూసిన సైబర్ కేసులలో ఇదే అతి పెద్ద కేసు అని పోలీసులు వెల్లడిస్తున్నారు.