Saturday, November 16, 2024

మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్.. సోదరుడి ఇంటికి హైడ్రా నోటీసులు

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. హైదరాబాద్ లో నాలాలు, చెరువులను ఆక్రమించి నిర్మించిన భవనాలను కూల్చివేస్తామని.. తన కుటుంబ సభ్యులు, బంధువుల నిర్మాణాలు ఉన్నా వదలమని సిఎం రేవంత్ స్పష్టం చేశారు. అన్నట్టుగానే హైడ్రా దూకుడు పెంచింది.  సిఎం రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటికి హైడ్రా అధికారులు నోటీసులు అంటించారు.

మాదాపూర్ అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో తిరుపతిరెడ్డి అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇల్లు FTL పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు దుర్గం చెరువును ఆనుకుని ఉన్న కావూరి హిల్స్, నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేశారు. నెలలోగా అక్రమ కట్టడాలు కూల్చేయాలని అధికారులు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News