Wednesday, January 15, 2025

హైడ్రా కూల్చివేతలపై అధికారులతో సీఎస్‌ సమావేశం

- Advertisement -
- Advertisement -

హైడ్రా కూల్చివేతలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులతో సమావేశమయ్యారు. నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్లాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సిఎస్ సమావేశం నిర్వహించారు. హైడ్రా, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో సీఎస్‌ చర్చిస్తున్నారు.

హైదరాబాద్ లోని నాలాలు, చెరువులను కబ్జాల నుంచి కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా కమిషన్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సొంత కుటుంబ సభ్యలు ఉన్నా.. ఎంతటి వారున్నా.. అక్రమ కట్టడాలు అని తేలితే వదిలి పెట్టమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో ఇప్పటికే నగరంలో నాలాలను కబ్జా చేసి కట్టిన పలు కట్టడాలను అధికారులు కూల్చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News