Sunday, December 22, 2024

హైడ్రా నోటీసులపై స్పందించిన రేవంత్ రెడ్డి తమ్ముడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తన ఇంటికి వచ్చిన నోటీసులపై సిఎం రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి స్పందించారు. 2015లో ఇల్లు కొనుగోలు చేశామని, కొనేటప్పుడు అన్ని పత్రాలు న్యాయవాది ధ్రువీకరణ తర్వాత కొన్నామని వివరణ ఇచ్చారు. బఫర్ జోన్ లో ఉన్నట్టు ఇప్పుడు నోటీసులు ఇచ్చారన్నారు. అన్ని అనుమతులు తీసుకునే నా ముందు యజమాని ఇల్లు కట్టాడని, ఎఫ్ టిఎల్, బఫర్ జోన్ లో చెరువు ఉందా అనే విషయం తనకు తెలియదని తిరుపతి రెడ్డి స్పష్టం చేశారు. సమయమిస్తే సామాన్లు తీసుకుంటానని, కూల్చివేస్తే సహకరిస్తానని పేర్కొన్నారు. తన నివాసం ఉన్నందుకే ఇక్కడ నివసించే అందరికి ఇబ్బంది వచ్చిందని, ప్రతిపక్షాలు తనని టార్గెట్ చేశాయని ఆరోపణలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News