- Advertisement -
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లో ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణ కోసం ఏర్పాటైన సంస్థ ‘హైడ్రా’. గవర్నమెంట్ ఊతంతో దూసుకెళుతోంది. గంటల వ్యవధిలో ఎవడిదైనా, ఎలాంటి భవనమైనా సరే అక్రమం అని తెలియగానే కూల్చేస్తోంది. అక్రమార్కులు గజగజలాడుతున్నారు.
అధికారులు అనుమతించాకే తాము ఇండ్లు కట్టుకున్నామని…తమ తప్పేముందని కొందరు నిలదీస్తుండడంతో హైడ్రా పునరాలోచనలో పడింది. అంతేకాక ఎఫ్ టిఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులపై కూడా చర్యలు చేపట్టాలని భావిస్తోంది. అలాంటి అధికారుల వివరాలు సేకరించి వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. దాంతో అక్రమ కట్టడాలకు అనుమతించిన అధికారుల గుండెల్లో గుబులు మొదలయిందని తెలుస్తోంది.
- Advertisement -