- Advertisement -
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ముగ్గురు మహిళా నక్సలైట్లను భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ విషయాన్ని అధికారులు అధికారికంగా తెలియజేశారు. హతమైన మహిళా నక్సలైట్ల నుంచి అనేక ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. సైనికుల బృందం పెట్రోలింగ్‌లో ఉండగా సైనికులు ముగ్గురు మహిళా నక్సలైట్‌లను చూశారు. ఈ సందర్భంగా సైనికులకు, నక్సలైట్స్ మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మహిళా నక్సలైట్స్ అక్కడికక్కడే మరణించారు. ఇదిలావుండగా నక్సలైట్ల విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ఒక భారీ ప్రకటన చేశారు. 2025 నాటికల్లా దేశంలో నక్సలైట్లను పూర్తిగా అంతమొందిస్తామని అన్నారు.
- Advertisement -