Sunday, December 22, 2024

నా వ్యాఖ్యల పట్ల బేషరుతుగా విచారం: రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత న్యాయ వ్యవస్థపై తనకు అత్యంత విశ్వాసం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎంఎల్‌సి కవిత బెయిల్‌పై సిఎం రేవంత్ రెడ్డి తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. తన వ్యాఖ్యలను న్యాయ వ్యవస్థను ప్రశ్నిస్తున్నట్లు ఆపాదించటం సరైంది కాదన్నారు. పత్రికల్లో వచ్చిన వార్తలపై రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ స్వతంత్రత పట్ల తనకు అత్యంత నమ్మకం ఉందని, తన వ్యాఖ్యల పట్ల బేషరుతుగా విచారం వ్యక్తం చేస్తున్నానని రేవంత్ వివరణ ఇచ్చారు.

ఎంఎల్‌సి కవితకు బెయిల్ ఇవ్వడాన్ని తప్పుపట్టడంలేదని, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు బెయిల్ రావడానికి 15 నెలలు పట్టిందని, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఇప్పటికీ బెయిల్ రాలేదని, ఆమెకు ఎలా వచ్చిదని రేవంత్ రెడ్డి ప్రశ్నించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News