Thursday, September 19, 2024

మంగోలియాలో పుతిన్ పర్యటన

- Advertisement -
- Advertisement -

మంగోలియాలో ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ పర్యటన గురించి స్థానిక అధికార వర్గాలు వివరణ ఇచ్చాయి. మంగోలియాకు తమ దేశాధినేత వెళ్లే విషయంలో ఎటువంటి భయాందోళనలు లేవని ప్రకటించారు. సెప్టెంబర్ 3వ తేదీన మంగోలియాకు రష్యా నేత వెళ్లుతున్నారు. ఇక్కడ వివాదాస్పద విషయం ఒకటి ఉంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసిసి)లో మంగోలియా ఓ సభ్యదేశంగా ఉంది. కాగా ఉక్రెయిన్ యుద్ధనేరాల సంబంధిత అంశంలో పుతిన్‌పై ఐసిసి గత ఏడాది అరెస్టు వారంటు జారీ చేసింది. ఈ దేశంలో పుతిన్ తొలిసారిగా పర్యటించనున్నారు.

ఐసిసి వారంటు జారీ తరువాత దీని పరిధిలోని వారు సభ్య దేశాల భూభాగంలోకి వస్తే నిబంధనల ప్రకారం వారిని అరెస్టు చేయాల్సి ఉంటుంది. యుద్ధ నేరాల చట్టాల పరిధిలో విచారణకు తరలించాల్సి ఉంటుంది. ఐసిసి పరిధిని , అధికారాలను తాము అంగీకరించడం లేదని పుతిన్ అధికార ప్రతినిధిడిమిట్రీ పెస్కోవ్ గతంలోనే పేర్కొన్నారు. కాగా మరోమారు ఆయన ఇదే విషయం స్పష్టం చేస్తూ మంగోలియాలోని తమ సానుకూల మిత్రులతో ఎప్పటికప్పుడు అత్యద్భుత సంప్రదింపులు సాగుతూ ఉన్నాయని, మంగోలియాకు తమ దేశ నేత పర్యటన విషయంలో ఎటువంటి ఆందోళన లేదని కూడా వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News