‘తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అచ్చంగా టిటిడి అనుసరించిన తరహాలోనే బోర్డుకు స్వయం ప్రతిపత్తి, విధి, విధానాలు ఉండేలా అవసరమైతే చట్ట సవరణ చేయాలని సిఎం రేవంత్ ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ రాజ గోపురానికి బంగారు తాపడం పనులను ప్రారంభించాలని ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు చాలావరకు అర్ధతరంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
అలా ఆగిపోవడానికి వీల్లేదని, ఇప్పటివరకు ఏమేం అభివృద్ధి పనులు జరిగాయి, ఇంకా ఏమేం అసంపూర్తిగా ఉన్నాయన్న వివరాలతో వారం రోజుల్లో సమగ్ర నివేదికను అందించాలని అధికారులను ఆదేశించారు. అక్కడికి వచ్చే భక్తుల సౌకర్యాలు, విడిది చేసేందుకు కాటేజీలు నిర్మాణాలకు దాతలు, కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అద్భుతంగా యాదగిరిగుట్టను తీర్చిదిద్దాలని చెప్పారు.