Thursday, December 19, 2024

సెప్టెంబర్ 4న కశ్మీరుకు రాహుల్

- Advertisement -
- Advertisement -

నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల కోసం ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సెప్టెంబర్ 4న జమ్మూ, కశ్మీరులో రెండు ఎన్నికల ర్యాలీలలో ప్రసంగించనున్నారు. రాహుల్ గాంధీ ప్రచారంలో పాల్గొనాలని కూటమి అభ్యర్థులతోపాటు జమ్మూ కశ్మీరు ప్రజలు కూడా కోరుకుంటున్నారని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మీర్ శనివారం విలేకరులకు తెలిపారు. దక్షిణ కశ్మీరు జిల్లాలోని దూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీర్ దూరు స్టేడియంలో రాహుల్ గాంధీ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తారని ఆయన చెప్పారు. ‘

జమ్మూలోని సంగల్‌దన్‌లో మరో ర్యాలీలో ఆయన ప్రసంగిస్తారని మీర్ తెలిపారు. తమ ఆహ్వానాన్ని రాహుల్ గాంధీ అంగీకరించినందుకు ఆనందిస్తున్నామని, ఇది మొదటి దశ మాత్రమేనని, ఇతర దశలలో కూడా రాహుల్ జమ్మూ కశ్మీరును సందర్శించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతోసహా దాదాపు 40 మంది స్టార్ క్యాంపేనర్లు జమ్మూ కశ్మీరు అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచారం చేయనున్నట్లు మీర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News