- Advertisement -
బెంగళూరు వెళ్లాల్సిన ఇండిగో విమానం ఇంజిన్ వైఫల్యంతో కోల్‌కతా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగా కావలసి వచ్చింది. శుక్రవారం రాత్రి 10.36 గంటలకు ఈ విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఎడమవైపు ఇంజిన్ వైఫల్యం చెందింది. దాంతో కోల్‌కతా లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాత్రి 10.53కు అత్యవసరంగా లాండింగ్ కావలసి వచ్చింది. అయితే విమానంలో నిప్పు రవ్వలు రావడం కానీ మరెలాంటి సంఘటన చోటు చేసుకోలేదని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికార ప్రతినిధి శనివారం వెల్లడించారు. అత్యవసర హెచ్చరిక రాత్రి 10.39 కి ప్రకటించి 11.08 కి ఉపసంహరించుకున్నారు.
- Advertisement -