కేదారినాథ్‌లో ఇటీవల నిరుపయోగంగా పడిఉన్న హెలికాప్టర్‌ను శనివారం మరమ్మతుల కోసం ఆర్మీ చాపర్‌తో తరలిస్తుండగా జారిపడింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం కానీ ఆస్తినష్టం కానీ జరగలేదని అధికారులు వెల్లడించారు. లింఛోలి ఏరియా మందాకిని నదిలో ఈ హెలికాప్టర్ పడిపోయిందని చెబుతున్నారు. గత మే నెలలో కేదారినాథ్‌కు భక్తులను క్రెస్టల్ ఏవియేషన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్‌లో తరలించి తిరిగి వెళ్తుండగా సాంకేతిక సమస్యల కారణంగా అత్యవసరంగా కిందకు దించవలసి వచ్చింది. అప్పటి నుంచి నిరుపయోగంగా ఉంది.
దీనికి మరమ్మతులు చేయించాలని ఇండియన్ ఆర్మీకి చెందిన ఎంఐ 17భారీ చాపర్ ద్వారా గచౌర్‌కు తరలించడానికి సిద్ధమయ్యారు. చాపర్‌కు తీగలు కట్టి హెలికాప్టర్‌ను మోసుకు వెళ్తుండగా అధిక బరువు, గాలుల కారణంగా కేదారినాథ్ గచౌరీ మధ్యలో బీంబాలి ప్రాంత సమీపంలో హెలికాప్టర్ అదుపు తప్పడంతో చాపర్ పైలట్ ముందుగా గుర్తించి ఆ హెలికాప్టర్‌ను కిందకు జారవిడిచిపెట్టాడు. కొండల మధ్య జారిపడిపోతున్న హెలికాప్టర్‌ను స్థానికులు వీడియో తీశారు. రెస్కూ బృందాలు ఆ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు.