Friday, November 22, 2024

గూగుల్ పేలో కొత్త ఫీచర్లు

- Advertisement -
- Advertisement -

ప్రముఖ పేమెంట్స్ యాప్ గూగుల్ పేలో కొత్త ఫీచర్లు తీసుకువచ్చారు. ఇందులో భాగంగానే యుపిఐ సర్కిల్ సహా మరికొన్నింటిని పరిచయం చేశారు. ముంబయిలో మూడు రోజుల పాటు జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (జిఎఫ్‌ఎఫ్) 2024 ముగింపు సందర్భంగా ఈ మేరకు గూగుల్ పే నుంచి ప్రకటనలు వచ్చాయి. కాగా, యుపిఐ సర్కిల్‌తో గూగుల్ పే వినియోగదారులు (ప్రైమరీ యూజర్లు) తమ కుటుంబ సభ్యులు, స్నేహితులను సెకండరీ యూజర్లుగా అనుమతించవచ్చు. దీనితో తమ బ్యాంక్ ఖాతాను లింక్ చేసుకోకుండానే ఇకపై వారంతా కూడా ప్రైమరీ యూజర్ అకౌంట్ ద్వారానే డిజిటల్ చెల్లింపులు జరుపుకోవచ్చు.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిపిఐ) భాగస్వామ్యంతో గూగుల్ పే దీనిని తీసుకువచ్చింది. అదే విధంగా ఈ సందర్భంగా యుపిఐ వోచర్స్ (ఇరూపీ)నీ గూగుల్ పే ప్రారంభించింది. ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలతో పాటు ప్రస్తుత యుపిఐ వినియోగదారులు వీటిని జారీ చేయవచ్చు. అంతే కాకుండా, రూపే కార్డుల కోసం ట్యాప్ అండ్ పే చెల్లింపుల సౌకర్యాన్నీ గూగుల్ పే కల్పించింది. ఈ పేమెంట్స్ కోసం రూపే కార్డుదారులు తమ మొబైల్ ఫోన్లను కార్డులతో అనుసంధానించుకోవలసి ఉంటుంది. యుపిఐ లైట్ కోసం ఆటో పే ఆప్షన్, యాప్‌పై క్లిక్‌పే క్యుఆర్ కోసం గూగుల్ పే సపోర్ట్‌నూ అందిస్తున్నది. కాగా, ఆర్థిక వ్యవస్థలో డిజిటైజేషన్‌ను మరింత విస్తృత పరచడానికి ఈ నెలలో జరిగిన ద్రవ్య సమీక్షలో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బిఐ) తీసుకున్న నిర్ణయాలు, ఇచ్చిన అనుమతుల మేరకే ఈ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News