Wednesday, April 2, 2025

షూటింగ్‌లో రుబినాకు కాంస్యం

- Advertisement -
- Advertisement -

పారాలింపిక్స్‌లో భారత్ మరో పతకం సొంతం చేసుకుంది. శనివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్ 1 ఫైనల్ల్లో భారత్‌కు చెందిన రుబినా ఫ్రాన్సిస్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం గెలుచుకుంది. అద్భుత ఆటతో అలరించిన రుబినా 211.1 పాయింట్లను సాధించి కంచు పతకాన్ని దక్కించుకుంది. జవాన్మార్డి సారె (ఇరాన్) 236.8 స్కోరుతో ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణ పతకం దక్కించుకుంది. ఇక తుర్కియోకు చెందిన 46 ఏళ్ల వెటరన్ షూటర్ ఐసెల్ ఓజ్గాన్ 231.1 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకుంది.

భారత షూటర్ రుబినా అసాధారణ ప్రతిభతో పారాలింపిక్స్‌లో దేశానికి ఐదో పతకం సాధించి పెట్టింది. భారత్ సాధించిన ఐదు పతకాల్లో నాలుగు షూటింగ్‌లోనే రావడం గమనార్హం. అవని లేఖరా స్వర్ణం సాధించగా, మనీశ్ నర్వాల్ రజతం, మోనా అగర్వాల్ కాంస్యం సాధించారు. అథ్లెటిక్స్‌లో ప్రీతి పాల్ కాంస్యం గెలుచుకుంది. ఇక బ్యాడ్మింటన్‌లో భారత్‌కు రెండు కాంస్య పతకాలు ఖాయమయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో సుకాంత్ కదమ్, సుహాస్ యతిరాజ్‌లు సెమీ ఫైనల్‌కు చేరుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News