Monday, December 23, 2024

‘సరిపోదా శనివారం’ చాలా లాంగ్ రన్ వుండే సినిమా: నాని

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ బ్లాక్ బస్టర్ మూవీ ’సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా, ఎస్‌జె సూర్య పవర్‌ఫుల్ రోల్‌లో నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌తో నిర్మించారు. తాజాగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన స్పందనతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొని, హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ థాంక్స్ మీట్ నిర్వహించింది.

ప్రెస్ మీట్‌లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ “సినిమా బావుంటే తెలుగు ఆడియన్స్ తలమీద పెట్టుకుంటారని మరోసారి నిరూపించినందుకు ధన్యవాదాలు. ఇంత వర్షంలో కూడా అన్ని చోట్ల సినిమా హౌస్ ఫుల్స్ అవుతున్నాయంటే ఆనందంగా ఉంది. ‘సరిపోదా శనివారం’ నాట్ వీకెండ్ ఫిల్మ్.. ’సరిపోదా శనివారం’ హియర్ ఫర్ లాంగ్ కాల్. లాంగ్ రన్ వుండబోతోంది. సినిమాలో ఎస్‌జె సూర్య పర్ఫర్ఫార్మెన్స్‌ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. దానయ్యతో రెండో సినిమా ఇది. నిన్ను కోరి చాలా స్పెషల్ మూవీ. ఇప్పుడు ‘సరిపోదా శనివారం’. నెక్స్ టైం సినిమా చేసినప్పుడు అంచనాలు ఎక్కువగా వుంటాయి” అని అన్నారు.

డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. “నామీద నాకున్న నమ్మకం కంటే నామీద నానికి వున్న నమ్మకం ఎక్కువ. సగం గడ్డంతో ఇంట్రో సీన్ చేద్దామని చెప్పినప్పుడు మరో ఆలోచన లేకుండా చేసేద్దామని అన్నారు. అంత ఫ్రీడమ్ దొరికింది కాబట్టే ఇలాంటి మంచి సినిమా రాగలిగింది” అని తెలిపారు.

నిర్మాత దానయ్య మాట్లాడుతూ.. “ప్రీరిలీజ్ ఈవెంట్‌లోనే ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని చెప్పాను. ఈ రోజు రిజల్ట్ కూడా అలానే వుంది. సినిమాని ఇంత బాగా తీసిన వివేక్‌కి థాంక్ యూ. నిన్ను కోరి తర్వాత మళ్ళీ మాకు రెండో సక్సెస్ తీసుకొచ్చిన నానికి థాంక్ యూ”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్, సాయి కుమార్, శివాజీ రాజా పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News