Thursday, September 19, 2024

రేపు హైదరాబాద్ లో బడులకు సెలవు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడుతున్న కారణంగా రేపు(సోమవారం) హైదరాబాద్ లో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు తెరుచుకోవు. ఈ మేరకు అధికారులు తెలిపారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా పాఠశాలలను మూసి ఉంచనున్నట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నింటినీ మూసి ఉంచుతారు.

ఇదిలావుండగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు వరద ప్రభావిత ఖమ్మం ప్రాంతాలను, రిలీఫ్ సంటర్లను సందర్శించారు. ముఖ్యంగా మధిర మండల్ లోని వాగవేడు గ్రామం సందర్శించి చూశారు. వరద బాధితులకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులకు ఆదేశాలిచ్చారు. హైదరాబాద్ లోని హుస్సేన సాగర్ లోకి భారీ ప్రవాహం కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె. నాగరత్నం మరో మూడు రోజుల పాటు వానలు పడే అవకాశం ఉందని అప్ డేట్ ఇచ్చారు. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుకుగా ఉన్నాయి. నారాయణ్ పేట్, మహబూబాబాద్, వరంగల్ , కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, సూర్యాపేట్, వనపర్తి జిల్లాల్లో వానలు దంచి కొడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News