Sunday, December 22, 2024

ప్రొటోటైప్ వందే భారత్ స్లీపర్ ట్రెయిన్ ను ఆవిష్కరించిన అశ్వినీ వైష్ణవ్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: రాత్రిపూట రైలు ప్రయాణాలకు అనుగుణమై ప్రొటోటైప్ వందే భారత్ స్లీపర్ రైళ్ల నమూనాను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం ఆవిష్కరించారు. బెంగళూరులోని BEML తయారు చేసిన ఈ రైళ్లు 800-1,200-కిమీ. ప్రయాణాలకు అనువైనవి; ప్రయాణీకులకు వీటి సేవలు 3 నెలల్లో ప్రారంభమవుతాయి.

గరిష్టంగా గంటకు 160 కిమీ. వేగంతో రూపొందించబడిన స్లీపర్ రైలులో 16 కోచ్‌లు – 11 త్రీ-టైర్ AC కోచ్ లు, 4 టూ-టైర్ , వన్-టైర్ AC కోచ్‌ – మొత్తం 823 బెర్త్‌ లు ఉంటాయి.

బెంగళూరులోని BEML తయారీ కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో వైష్ణవ్ మాట్లాడుతూ, వందే భారత్ స్లీపర్ రైళ్లు అనేక ఫీచర్లతో కూడుకున్నాయని, పైగా మధ్యతరగతి కుటుంబాల కోసం రూపొందించబడ్డాయని, వాటి ఛార్జీలు సహేతుకమైనవిగా ఉంటాయని తెలిపారు.

వందే భారత్, వందే భారత్ స్లీపర్, వందే మెట్రో , అమృత్ భారత్ రైళ్లు ప్రజల ప్రయాణ విధానాన్ని మారుస్తాయని, నవ భారతదేశానికి అనుగుణంగా “ప్రయాణ నాణ్యతలో గణనీయమైన మెరుగుదల”ని అందిస్తాయని మంత్రి వైష్ణవ్ తెలిపారు.

Vande-Bharat-2

Vande-Bharat-3

Vande Bharat 4

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News