Monday, December 23, 2024

ఇజ్రాయెల్ పోలీస్ లపై పాలస్తీనా ఉగ్రవాదుల దాడి

- Advertisement -
- Advertisement -

ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ పోలీస్ ఆఫీసర్లతో వెళ్తున్న వాహనంపై ఆదివారం పాలస్తీనా ఉగ్రవాదులు దాడి చేసి ముగ్గురు ఇజ్రాయెల్ పోలీస్ అధికారులను హతం చేశారు. దక్షిణ వెస్ట్‌బ్యాంక్‌లో రోడ్డు వెంబడి ఈ దాడి జరిగింది. ఉత్తర ప్రాంతంలోని అర్బన్ శరణార్థ శిబిరాలను లక్షంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. ఈ ప్రాంతంలో రోజూ ఇజ్రాయెల్ దళాలు దాడులు సాగిస్తుండడం పరిపాటి అయింది. చనిపోయిన ముగ్గురూ పోలీస్ అధికారులేనని,

దాడులకు పాల్పడిన వారు తప్పించుకున్నారని పోలీస్ వర్గాలు నిర్ధారించాయి. ఖలీల్ అల్ రెహ్మాన్ బ్రిగేడ్ అనే మిలిటెంట్ గ్రూప్ ఈ దాడులు తామే చేశామని ప్రకటించింది. ఈ దాడులను హమాస్ ప్రశంసించింది. గాజాలో యుద్ధానికి ఇది సహజమైన స్పందనగా పేర్కొంది. మరికొన్ని దాడులు చేయాలని పిలుపునిచ్చింది. గత అక్టోబర్ 7న హమాస్ దాడులు చేసిన దగ్గర నుంచి వెస్ట్‌బ్యాంక్‌లో హింసాత్మక దాడులు ముమ్మరంగా సాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News