- Advertisement -
రష్యా తూర్పు ప్రాంతంలో 22 మంది ప్రయాణికులతో అదృశ్యమైన హెలికాప్టర్ కూలిపోయినట్టు అధికారులు ప్రకటించారు. చివరిసారి సంకేతాలు వచ్చిన ప్రాంతానికి సమీపంలో 900 మీటర్ల ఎత్తైన ప్రదేశంలో హెలికాప్టర్ శకలాలను గుర్తించామని, ఇప్పటివరకు 17 మృతదేహాలను వెలికి తీయడమైందని అధికారులు ప్రకటించారు.
మిగతా ఐదుగురి కోసం అన్వేషిస్తున్నట్టు తెలిపారు. ఎంఐ 8 శ్రేణికి చెందిన ఈ హెలికాప్టర్ … ముగ్గురు సిబ్బంది, 19 మంది ప్రయాణికులతో కమ్‌చత్కా ద్వీపకల్పం లోని వచ్చజెట్స్ అగ్ని పర్వతం సమీపం నుంచి బయలుదేరింది. కానీ గమ్యస్థానాకి చేరలేదు. వచ్చజెట్స్ సమీపంలో రాడార్ నుంచి మాయమైంది. ప్రమాదానికి ప్రతికూల వాతావరణ పరిస్థితులే కారణమైనట్టు అంచనా వేస్తున్నారు.
- Advertisement -