Sunday, December 22, 2024

సూర్యాపేట మీదగా హైదరాబాద్ టూ విజయవాడ రోడ్ క్లోజ్!

- Advertisement -
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పాలేరు వాగు ప్రవాహానికి జాతీయ రహదారిపై నీరు చేరింది. దీంతో హైదరాబాద్-విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో సూర్యాపేట ఎస్‌పి సన్‌ప్రీత్ సింగ్ సూర్యాపేట మీదగా ఖమ్మం, విజయవాడ వెళ్లే ప్రజలు ప్రయాణం వాయిదా వేసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్లే మార్గంలో నాయకినిగూడెం వద్ద పాలేరువాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోందని వెల్లడించారు. రక్షణ చర్యల్లో భాగంగా ఈ మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేసినట్లు ఎస్‌పి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News