Monday, December 23, 2024

సిఎం రేవంత్‌కు ప్రధాని ఫోన్

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేసి రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితులను, జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. పలు జిల్లాల్లో భారీ వర్షం.. వరదతో వాటిల్లిన నష్టాన్ని సిఎం ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తక్షణ సహాయక చర్యలను.. తీసుకున్న జాగ్రత్తలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానికి వివరించారు.

ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం సంభవించిందని సిఎం ప్రధానికి తెలిపారు. ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించినందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రధాని మోడీ అభినందించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సేవలు అందించే హెలికాప్టర్లను పంపిస్తామని సిఎంకు ప్రధాని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తరపున అవసరమైన వరద సహాయక చర్యలు అందిస్తామని ప్రధాని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News