Sunday, November 24, 2024

24గంటలూ అప్రమత్తంగా ఉండండి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న నేపథ్యంలో అత్యవసరమనుకుంటే తప్ప ప్రజలు బయటకి రావొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సిఎం అత్యవసర సమీక్ష నిర్వహించారు. సీనియర్ మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు తదితరులతో సిఎం ఫోన్‌లో రివ్యూ చేసి అప్రమత్తం చేశారు.

సిఎస్, డిజిపి, మున్సిపల్, విద్యుత్, పంచాయతీ రాజ్, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని టెలి కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్‌పిలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు 24 గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సిఎం ఆదేశించారు. అధికారులు సెలవులు పెట్టొద్దని, సెలవులు పెట్టిన వారు వెంటనే రద్దు చేసుకొని వెంటనే పనుల్లో నిమగ్నం కావాలని తెలిపారు. అత్యవసర విభాగాల అధికారులు క్షేత్ర స్థాయిలో ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సిఎంఒ కార్యాలయానికి పంపాలని అన్నారు.

రేవంత్‌కు అమిత్ షా ఫోన్
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసి రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో వరదలతో వాటిల్లిన నష్టాన్ని సిఎం రేవంత్‌రెడ్డి వివరించారు. ప్రాణ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని సిఎం అమిత్ షాకు తెలిపారు. అవసరమైన తక్షణ సాయం అందిస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా సిఎంకు హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News