Friday, January 3, 2025

వరంగల్ జిల్లాలో వరుణుడి ప్రతాపం.. వరదల్లో కొట్టుకుపోయి ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ వర్షానికి ఐదుగురు వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో మందపల్లికి చెందిన ఓ వృద్ధురాలు మరణించగా.. మలుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పశువులను మోతకు తీసుకెళ్లి వస్తుండగా వరద ప్రవాహానికి కొట్టుకుపోయి మృతి చెందాడు. పరకాల గ్రామానికి చెందిన మరో వ్యక్తి చెరువులో చేపల వేటకు వెళ్లి గల్లంతు అయ్యి చివరికి శవంగా బయటకువచ్చాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News