- Advertisement -
హైదరాబాద్ సిటీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తనకు రెండు వేల రూపాయలు ఇవ్వాలంటూ చాయ్ మాస్టర్‌ను చోటు అనే యువకుడు దారుణంగా కొట్టాడు. బాగ్ లింగంపల్లిలో ఆదివారం అర్ధరాత్రి ఓ పాన్‌షాప్ దగ్గరకి వచ్చిన చోటు, నరేశ్ ఇద్దరు యువకులు అక్కడ పనిచేసే చాయ్ మాస్టర్‌తో రూ.2 వేలు ఇవ్వాలని గొడవకు దిగారు.
చోటు, చాయ్ మాస్టర్ తలపై పిడిగుద్దులు కురిపించాడు. అతను ప్రాధేయపడినా వినకుండా తీవ్రంగా కొట్టాడు..ఈఘటనకు సంబంధించిన వీడియో సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాడి చేసిన యువకుడిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. అతను గంజాయి మత్తులో ఉన్నాడని.. అతనిపై పోలీసులు యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
- Advertisement -