Saturday, November 9, 2024

కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ సినిమా విడుదలకు అనేక అడ్డంకులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లోక్ సభ సభ్యరాలు(ఎంపీ) కంగనా రనౌత్ స్వయంగా దర్శకత్వం వహించి, నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమాపై అనేక రాష్ట్రాల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ సినిమా విడుదల కాక ముందే ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. సెన్సార్ బోర్డు కూడా ఈ సినిమాకు ఇంత వరకు సర్టిఫికేట్ ఇవ్వలేదు. చాలా సున్నితమైన విషయాలు సినిమాలో ఉన్నందునే అనుమతి ఇవ్వడం లేదని సెన్సార్ బోర్డ్ వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు ఆమెకు నోటీసులు జారీ చేసింది. మధ్యప్రదేశ్ లో ఈ సినిమాపై అనేక కేసులు నమోదయ్యాయి. పలువురు ఈ సినిమాను నిషేధించాలని కోరుతూ హైకోర్టులో ‘పిల్’ దాఖలు చేశారు.

‘ఎమర్జెన్సీ’ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఏదో విధంగా సినిమా పూర్తయినప్పటికీ రిలీజ్ కు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. అసలు సెప్టెంబర్ 6 కే ఈ సినిమా విడుదల కావలసింది. కానీ సెన్సార్ సర్టిఫికేట్ రాక వాయిదా పడింది.

ఈ సినిమాలో కంగనా రనౌత్ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించింది. ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితి(ఎమర్జెన్సీ), ఆమె హత్య వంటివి ఈ సినిమాలో ఉంటాయని సమాచారం. ఈ సినిమా ప్రమోషన్ ట్రయిలర్ కూడా వచ్చేసింది. కానీ అసలు సినిమాకే అడ్డంకులు కోకొల్లలు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News